మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం
On
ఏపీలో మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టెట్ రాసిన వారు వెయిట్ చేస్తున్నారు. అయితే డీఎస్సీ కంటే ముందే మరో టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకంటే చాలా మంది టెట్ క్వాలిఫై కాని వారు ఉన్నారు.
వారి కోసం మరోసారి టెట్ నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా సంచలన ప్రకటన చేసింది. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 10లోపు నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది.