అనంతపురం హాస్టల్‌లో దారుణం.. ఇద్దరు విద్యార్థినులపై బ్లేడుతో దాడి
అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఘటన.
Anantapur: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఒక ఘటన సంచలనంగా మారింది. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని అర్ధరాత్రి వేళ తోటి ఇద్దరు విద్యార్థినులపై బ్లేడుతో దాడి చేయడం కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విడపనకల్లు గ్రామానికి చెందిన సుస్మిత, సోఫియా అనే విద్యార్థినులు హాస్టల్‌లో ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. గురువారం రాత్రి వీరు నిద్రపోతున్న సమయంలో అదే హాస్టల్‌కు చెందిన మరొక విద్యార్థిని బ్లేడుతో వారి గొంతు కోయడానికి ప్రయత్నించింది. అయితే బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరు బాలికల గొంతు వద్ద స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సంఘటన అనంతరం గాయపడిన బాలికలకు ఆసుపత్రిలో సరైన వైద్య సహాయం అందించకపోవడంతో పాటు, విషయాన్ని కప్పిపుచ్చేందుకు హాస్టల్ వార్డెన్ ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర మార్గాల ద్వారా విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్‌కు చేరుకుని పాఠశాల యజమాన్యం, వార్డెన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో చదువుకునే పిల్లల రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.