రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు ఎమ్మెల్యే సార్?.. ఎర్రడికేర వాసుల ఆగ్ర‌హం..

  • ఎర్రడికేర గ్రామ రహదారి పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదని గ్రామస్తుల ఆవేదన.
  • వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.
  • ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ఆరోపణలు.
  • "రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు?" అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన గ్రామస్థులు

Kalyandurg News: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం ఎర్రడికేర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి దాదాపు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక దయనీయ స్థితికి చేరుకుంది. గుంతలు, రాళ్లు, దుమ్ముతో నిండిపోయిన ఈ రహదారిపై ప్రయాణించడం నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రహదారి పరిస్థితి 'పెద్ది' సినిమాలో చూపించిన గ్రామీణ దృశ్యాలను తలపిస్తోందని స్థానికులు అంటున్నారు.

గ్రామస్తుల కథనం ప్రకారం, ఈ రహదారిని 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించగా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చే నాయకులు రహదారి సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, గెలిచిన తర్వాత గ్రామం వైపు కూడా చూడడం లేదని మండిపడుతున్నారు.

Read More ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్

ప్రస్తుతం గ్రామంలో విద్యార్థులు, రైతులు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇలాంటి సమస్యలు ఒక్క ఎర్రడికేర గ్రామానికే పరిమితం కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

"రహదారులే సరిగా లేని గ్రామాలకు సైకిళ్లు పంపిణీ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?" అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఎర్రడికేరతో పాటు నియోజకవర్గంలోని దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు మరమ్మతులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/mla-sir-erradikera-residents-are-asking-why-bicycles-for-villages/article-20353