9 చోట్ల ఈవీఎంల ధ్వంసం... చర్యలెక్కడని అనిల్ ఫైర్ 

9 చోట్ల ఈవీఎంల ధ్వంసం... చర్యలెక్కడని అనిల్ ఫైర్ 

ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతలు సత్య హరిచంద్రులు అన్నట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాత అల్లర్లు జరిగాయని అనిల్ ఆరోపించారు.

 

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..

అల్లర్లు జరిగే అవకాశం ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు నుంచి లేఖలు రాస్తూనే ఉన్నారని అన్నారు. అయినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ రిగ్గింగ్ లకు పాల్పడిందని అనిల్ కుమార్ ఆరోపించారు.కర్లగుంట, కేపి గూడెంలో ఇద్దరు డీఎస్పీలను మాత్రమే ఎందుకు పెట్టారని నిలదీశారు. రిగ్గింగ్ జరుగుతుందని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నాయని ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకోలేదని అన్నారు. 

 

Read More Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికలు..

ఏపీలో ఏకంగా 9 ఈవీఎంలు ధ్వంసమైతే పిన్నెల్లి మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని అనిల్ ప్రశ్నించారు. మిగిలిన 8 ఈవీఎంల పరిస్థితి ఏంటని నిలదీశారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించాడని ఆరోపించారు. రిగ్గింగ్‌పై ఎస్పీ స్పందించలేదని పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగలకొట్టినా పోలీసుల్లో స్పందన లేదు కానీ.. పిన్నెల్లిని వెంటాడటానికి మాత్రం పోలీసులు ముందున్నారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గం అధికారులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేశారని.. లావు కృష్ణ దేవారాయులు కూడా రిగ్గింగ్ కు పాల్పడ్డాడని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

Related Posts