కోతుల సమస్య నుండి గ్రామస్తులను కాపాడాలని, ఇ ఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కు వినతి.
విశ్వంభర ,సంస్ధాన్ నారాయణపురం:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జైహింద్ ఫంక్షన్ హాల్ లో ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ యువతతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇ ఎల్ వి భాస్కర్ ని, గ్రామానికి చెందిన బీసీ మేధావుల సంఘం రాష్ట్ర నాయకులు శికిలమెట్ల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా విద్య, వైద్యం, ఉపాధి అనే అంశం మీద అనేక రోజులుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇ ఎల్ వి ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ చైర్మన్ భాస్కర్ కు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసిన అనంతరం.. నారాయణపురం మండల కేంద్రంలో గత కొంతకాలంగా కోతుల బెడద వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిల్లలు ,మహిళలు, వికలాంగులు, వృద్ధులు, బయట తిరిగే పరిస్థితులు లేవని, కోతులు గుంపులు గుంపులుగా ఇండ్ల మీదకు చొరబడి గ్రామస్తులపై దాడులు సైతం చేస్తున్న విషయాన్ని వారు వివరించి. ఇ ఎల్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోతులను పట్టించి అటవీ ప్రాంతంలో వదిలివేయాలని గ్రామస్తుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీరు మంచి మనసుతో ఇట్టి విజ్ఞప్తిని స్వీకరించి మా గ్రామ ప్రజలను కోతుల బెడద నుంచి కాపాడుతారని విశ్వసిస్తూ మనవి చేయడం జరిగింది. ఇ ఎల్ వి భాస్కర్ సానుకూలంగా స్పందించి ఇట్టి తీవ్రమైన సమస్యను సంబంధిత అటవీశాఖ అధికారులతో మాట్లాడి ఇ ఎల్ వి బాస్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా కోతులను పట్టించి,వాటిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసి త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని కోతుల సమస్యలను ఇ ఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ డా.ఇ ఎల్.వి భాస్కర్ దృష్టికి తీసుకెళ్లి, కోతుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నందుకు గ్రామస్తులు శికిలమెట్ల వెంకటేశ్వర్ల ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలుపుతున్నారు.



