మహిళకు సర్జరీ చేసిన డాక్టర్లకు షాక్... కడుపులో 570 రాళ్లు

మహిళకు సర్జరీ చేసిన డాక్టర్లకు షాక్... కడుపులో 570 రాళ్లు

విశ్వంభర, వెబ్ డెస్క్  : ఓ మహిళకు సర్జరీ చేయగా డాక్టర్లు వీస్తూ పోయే ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఆమె కడుపులో దాదాపు 570 రాళ్లు బయటపడ్డాయి.  ఈ విచిత్ర సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... దేవ గుప్తంకు చెందిన నరస వేణి అనే మహిళ గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆసుపత్రికి వెళ్లకుండా...పెయిన్ కిల్లర్స్ మందలు వాడుతూ ఉండేది.

ఇటీవల కాలంలో నొప్పి తీవ్ర స్థాయికి చేరడంతో తట్టుకోలేక అమలాపురంలో ఏఎస్ఎ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. ఆమె కడుపులో నుంచి స్టోన్స్ చూసిన  డాక్టర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆమె కడుపులో నుంచి ఏకంగా 570 రాళ్లను బయటకు తీశారు. సాధారణంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో పదుల సంఖ్యలో రాళ్లు ఉంటాయని, ఆమె ఒంట్లో వందల కొద్దీ రాళ్లు ఉండటం చాలా అరుదైన విషయమని డాక్టర్లు తెలిపారు.

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి