ఘనంగా భక్త మార్కండేయ దేవాలయం 144వ వార్షికోత్సవం
విశ్వంభర, సుల్తాన్ షాహి,గౌలిపుర :- మార్కండేయ పౌర్ణమి పురస్కరించుకొని
శ్రీ భక్త మార్కండేయ దేవాలయం సుల్తాన్ షాహి లో 144 వార్షికోత్సవము అంగరంగ వైభవం నిర్వహించారు. మొదటి రోజులో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ మార్కండేయ స్వామి పూజ, రుద్ర యజ్ఞం, భజన కార్యక్రమాలు రాత్రి వరకు నిర్విరామంగా నిర్వహిస్తామని అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ తెలిపారు, 144 వార్షికోత్సవంలో మేమంతా భాగస్వామ్యం కావడం మాకెంతో సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి, సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా పద్మశాలి సంఘం గడ్డం జగన్నాథం, ప్రెసిడెంట్ పొలిటికల్ వింగ్ ఆల్ ఇండియా పద్మశాలి సంఘంబొల్ల శివశంకర్, వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ పద్మశాలి సంఘం, మరియు కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మ్యాకల వేణుగోపాల్, మ్యాకల మహేందర్, ప్రధాన కార్యదర్శి మాదాసు రామాoజులు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుమ్యాకల సిద్ది సాయికుమార్ మరి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



