పీర్ల పండుగకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేస్తా -  మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్-  ఉబేదుల్లా  కొత్వాల్  

పీర్ల పండుగకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేస్తా -  మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్-  ఉబేదుల్లా  కొత్వాల్  

విశ్వంభర, హైదరాబాద్ ; హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం రాష్ట్రస్థాయి సభ జరిగింది.  టి ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ,  మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  ఉబేదుల్లా కొత్వాల్ , ప్రముఖ రచయిత కవులు మాస్టర్ జి , టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ , మొహరం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టన్న, శ్రీధర్ , సాజిదా సికందర్  పాల్గొని ప్రసంగించారు. ఉబేదుల్లా  కొత్వాల్  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కోదండరాం  సహకారం తీసుకొని పీర్ల పండుగకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పీర్ల పండుగ తెలంగాణలో ఒక విశిష్టత కలిగిన పండుగగా ఆయన అభివర్ణించారు. సకల కులాల వారు, సబండ ప్రజల వారు ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములయ్య పండుగ మొహరం అని కీర్తించారు.

Tags: