మహిళలు ఆర్ధికశక్తిగా ఎదగాలి - ఎమ్మెల్సీ ఎల్. రమణ 

మహిళలు ఆర్ధికశక్తిగా ఎదగాలి - ఎమ్మెల్సీ ఎల్. రమణ 

విశ్వంభర, నారాయణ గూడ : గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి మహిళ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తరగతులు సామాజిక సేవకురాలు ఎలగందుల లలితమ్మ ప్రారంభించారు. గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ మహిళా సాధికారతకు తోడ్పడే లక్ష్యంతో ఉచిత కుట్టు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందాలంటే ఇటువంటి శిక్షణ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తే సమాజంలో సానుకూల మార్పులు వచ్చి తీరతాయని తెలిపారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి మహిళ అద్యక్షురాలు గుంటక రూప, గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తులు సుదర్శన్, బూరం వీణ, పులిపాటి సుకన్య, ఆడెపు శాంతి, బొట్ల గీత, కడవేరు అరుణ, ఒగ్గు చంద్రకళ, సంఘ నాయకులు కొక్కుల దేవేందర్, బండారు లక్ష్మీ, మడూర్ శశికళ, చిన్నకోట్ల సప్నా, నోముల రేఖ, చెరుకుపల్లి వర్ణలీల, అరుణశ్రీ, స్వరూప, గుర్రం శ్రవణ్, కల్లేపల్లి రాజు, రాకేష్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. శిక్షణ కేంద్రం ద్వారా మొదటి విడతలో 50 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం వారిని స్వయం ఉపాధికి ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

Read More తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్