ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తాం
విశ్వంభర, చండూర్ : రెండు సంవత్సరముల వరకు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థలు, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు గత సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం శనివారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు తన కుటుంబ సభ్యులతో కలిసి 17వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణలు మాట్లాడుతూ మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ తో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. మా గాంధీజీ విద్యాసంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కోడి ప్రీతి, కోడి శృతి, జెల్ల వివేక్, జెల్ల ధీరజ్, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.



