గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
On
విశ్వంబర, పరిగి: పరిగి మండలం పరిధిలోని రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ కరణం మందాకిని అరవింద్ రావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన ప్రణాళిక గురించి, వేసవి కాలంలో గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, జీవా వైవిధ్య కమిటీ పర్మిషన్ గురించి, వివిధ రకాలసమస్యల గురించి చర్చించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్ రావు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



