వరంగల్ మహాసభను విజయవంతం చేయాలి
- మాజీ కోశాధికారి డివిపి సుబ్బారావు.
విశ్వంభర, మిర్యాలగూడ : ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ మాజీ కోశాధికారి డివిపి సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను, హామీలను పట్టించుకోవడంలేదని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించమంటూ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని, తులం బంగారం హామీని తప్పుగా మలిచారని మండిపడ్డారు. రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఇంక నెరవేరే లేదని తెలిపారు. గులాబీ సైనికులారా లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రజతోత్సవ మహాసభల్లో పార్టీ పటిష్టత ప్రజా ఉద్యమ నిర్మాణం కొరకు అధినేత కేసిఆర్ దిశా నిర్ధేశం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ క్యాడర్ ఎలాంటి అందోళన చెందకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ వారికి అండగా ఉందామన్నారు.