
విశ్వంభర, హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్మూర్ మున్సిపల్ ఉద్యోగి మామిడిపల్లి నివాసి, నరేష్ ను బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులు పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ బకాయిలు చెల్లిస్తే, ఈఎస్ఐ ద్వారా మెరుగైన చికిత్స లభిస్తుందని తెలుపగా, వెంటనే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి పెండింగ్ లో ఉన్న 36 లక్షల రూపాయల బకాయిలను ఈఎస్ఐ వారికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సనత్ నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి నిజామాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి నుండి రికమెండ్ చేయించారు. ఒకవేళ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దీనికి సంబంధించి మెరుగైన చికిత్స లేనిచో, యశోద ఆసుపత్రిలోనే ఉంచి ఈఎస్ఐ ద్వారా ఆసుపత్రి బిల్లులు చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తానని వినయ్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.