తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా వనం చంద్రమౌళి నియామకం
On
ప్రజా విశ్వంభర, నిజామాబాద్ :- తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా వనం చంద్రమౌళి నీ నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ నేత నియామక పత్రం అందజేశారు. ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ లోకి నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం సీనియర్ నేత విశ్రాంత అధ్యాపకులు వనం చంద్రమౌళి నీ నియమించడం పట్ల పలువురు నాయకులూ హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి చేనేత సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతూ మీకు హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియయజేశారు. వనం చంద్రమౌళి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి భాధ్యతను అప్పగించిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ , నిరంతరం చేనేత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. చేనేత పరిరక్షణ కోసం పద్మశాలి జాతి చైతన్యం కోసం తన ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తానని అన్నారు.



