వైశ్యుల బలం చూపించాలి-  వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ .

   - ప్రముఖ వ్యాపారవేత్త  చిట్టిప్రోలు యాదగిరి 

వైశ్యుల బలం చూపించాలి-  వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ .

విశ్వంభర, హాలియా : వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కారణను చైర్మన్  డా. కాచం సత్యనారాయణ గుప్త సమక్షంలో  ప్రముఖ వ్యాపారవేత్త చిట్టిప్రోలు యాదగిరి వాల్ పోస్టర్ ను ఆవిష్కారించారు. ఈ సందర్బంగా చిట్టిప్రోలు యాదగిరి మాట్లాడుతూ వైశ్యుల హక్కులు సాధించుకోవడం కోసం ప్రతి వైశ్య బిడ్డ ముందుకు వచ్చి రణభేరి మహాసభను విజయవంతం చేయాలనీ కోరారు. వైశ్యుల కోసం పోరాటం చేస్తున్న డా. కాచం సత్యనారాయణ అభినందిస్తూ వైశ్య జాతి కోసం ప్రతిఒక్కరిని మేలుకొలుపుతున్న వారికి అభినందనలు తెలిపారు. ఆగస్ట్ 3 న వైశ్యుల పవర్ ఏంటో చూపించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక సలహాదారులు బుక్క ఈశ్వరయ్య ఉన్నారు.  

Tags: