ఆర్యవైశ్య సంఘం,  రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ 

ముఖ్య అతిధిగా పాల్గొన్న డా. కాచం సత్యనారాయణ 

ఆర్యవైశ్య సంఘం,  రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ 

విశ్వంభర, మిర్యాలగూడ : ఆగస్టు మూడో తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా.  కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరుతూ మిర్యాలగూడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ , ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైశ్య వికాస వేదిక , వైశ్య రాజకీయ రణభేరి చైర్మన్ డా. కాచం సత్యనారాయణ  హాజరై గోడ పత్రికను స్థానిక వైశ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం  స్థానిక సంస్థల్లో వైశ్యుల వాటా తేల్చాలన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు. ఈ రణభేరి ద్వారా వైశ్యుల ఆత్మగౌరవం  హక్కుల సాధనకై వైశ్య రాజకీయ రణభేరి మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకు సాగుతూ వైశ్యుల గొంతును  లేవనెత్తాలి. ఆగష్టు మూడవ తేదీన ప్రతి వైశ్యుడు కుటుంబ సభ్యులుతో కలిసి ఈ రణభేరికి  రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షడు తిరునగరు భార్గవ్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్  గౌరు శ్రీనివాస్,  కర్నాటి రమేష్,  సి హెచ్ శ్రీనివాస్, పాండురంగయ్య,  జె  రాములు, నాగరాజు గుండా, గందె రాము,  గుడుగుంట్ల గణేష్, గుడిపాటి నవీన్,  గట్టు రమేష్,  గౌరు విజయ్ కుమార్ , మా శెట్టి శ్రీనివాస్,  విద్యాసాగర్, కర్నాటి శరత్, శిల శ్రీనివాస్,  గుంటూరు నాగేశ్వరావు  ఆయిల్  శ్రీనివాస్, రేపాల శ్రీనివాస్, రేపాల లక్ష్మీకాంతం,ఇడుకుల శ్రీనివాస్, మైలవరపు మురళి, మిట్టపల్లి విజయభాస్కర్,  తదితరులు పాల్గొన్నారు. 

 

Tags: