వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ - ముఖ్య అతిధిగా పాల్గొన్న డా. కాచం సత్యనారాయణ గుప్త
విశ్వంభర, మేడ్చల్ మల్కాజిగిరి : ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ లో వాసవి మిత్రమండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రిక ఆవిష్కరణ చేపట్టిన కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక , వైశ్య రాజకీయ రణభేరి అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ముఖ్య అతిధిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వైశ్య రాజకీయ రణభేరి అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ ఆగస్టు 3 న హైద్రాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి మీటింగ్ కు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు హాజరు అవ్వాలని కోరుతూ అలాగే వైశ్యుల హక్కుల కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం , ఈడబ్ల్యుఎస్ వర్గీకరణ అంశాలతో పాటు వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతిఒక్కరు ఈ మీటింగ్ కు హాజరయ్యి విజయవంతం చేయాలనీ కోరారు. ఈ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి అధ్యక్షులు పెద్ది నాగరాజు గుప్త, ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి రాముని తిరుమలేష్ గుప్తా, కార్యనిర్వాన కార్యదర్శి గంప కృష్ణ గుప్తా, ఉపాధ్యక్షులు నంగునూరి అశోక్ గుప్తా, కార్యదర్శులు బాచెల్లి నవీన్ గుప్తా, అమర కృష్ణ గుప్తా, చందా సంతోష్ గుప్త, కార్యవర్గ సభ్యులు ఉప్పల ఆంజనేయులు గుప్తా, మిర్యాల అరుణ్ కుమార్ గుప్తా, ఏనిశెట్టి రమేష్ గుప్తా, రాయి కంటి వేణు గుప్త, సభ్యులు రాయల శ్రవణ్ గుప్తా, పెద్ది శ్రీనివాస్ గుప్త, పెద్ధి నవీన్ గుప్త, నీలా శివకుమార్ గుప్త, కొకలా కృష్ణమూర్తి గుప్త, పొద్దుటూరి వెంకటేశ్వర్లు గుప్తా, రాజూరి జగదీష్ గుప్తా, కండే శివగుప్త చంద్రగిరి తారకేశ్వర్ గుప్తా, అర్థం శ్రీనివాస్ గుప్తా, కోడూరి లక్ష్మణ్ గుప్త, విబివి కృష్ణ గుప్త, బుస్స శ్రీనివాస్ గుప్తా, రవ్వ ఈశ్వరరావు గుప్త, పసునూరి వెంకటేశం గుప్తా, దాచా ప్రసాద్ గుప్తా, గజ్జల రమేష్ గుప్తా, గుబ్బ రామచంద్ర గుప్తా, పొద్దుటూరి శ్రీధర్ గుప్తా, బెల్లీదే భగవాన్ గుప్తా, నిఖిల్ గుప్తా , మౌనిక తదితరులు పాల్గొన్నారు.




