వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేద్దాం: అధ్యక్షుడు దార రమేష్. 

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేద్దాం: అధ్యక్షుడు దార రమేష్. 

విశ్వంభర , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ఆగస్టు 3 వ తేదీన హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు   దార రమేష్ అన్నారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలని అన్నారు. వైశ్యులు ఎవరి వాటాలను అడగడం లేదని మేమెంతో మాకు అంతా సీట్లు కేటాయించాలని అన్నారు.. సమాజంలో వైశ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు వైశ్యులకు కూడా అవకాశం కల్పించాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ తేవాలని, కులగనన నివేదికలో అగ్రవర్ణాల వివరాలు కులాలవారీగా ప్రకటించాలని అన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల ఆర్యవైశ్యులు పాల్గొని వైశ్య రాజకీయ రణబేరి ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, శంకర్ రావు, మాజీ అధ్యక్షుడు రమేష్, ధీరజ్, శ్రీనివాస్, దామోదర్ రావు ,శ్రీరాములు, మనోహర్, తరుణ్ ,జగన్నాథం, శ్రీనివాస్, పవన్, హరి, నాగేశ్వరరావు, వీరాంజనేయులు, అవినాష్ గుప్తా , బుక్క ఈశ్వరయ్య, కోడుమూరి దయాకర్,
ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Tags: