వైశ్యుల వాటా తేలాల్సిందే - హాలియాలో వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ -
ముఖ్య అతిధిగా వైశ్య వికాస వేదిక , వైశ్య రాజకీయ రణభేరి చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త
విశ్వంభర, హాలియా : ఆగస్టు మూడో తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరుతూ నల్గొండ జిల్లా , హాలియా లోని లక్ష్మి నరసింహ గార్డెన్స్ లో స్థానిక వైశ్యులు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైశ్య వికాస వేదిక , వైశ్య రాజకీయ రణభేరి చైర్మన్ డా. కాచం సత్యనారాయణ హాజరై గోడ పత్రికను స్థానిక వైశ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో వైశ్యుల వాటా తేల్చాలన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు. ఈ రణభేరి ద్వారా వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై వైశ్య రాజకీయ రణభేరి మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకు సాగుతూ వైశ్యుల గొంతును లేవనెత్తాలి. ఆగష్టు మూడవ తేదీన ప్రతి వైశ్యుడు కుటుంబ సభ్యులుతో కలిసి ఈ రణభేరికి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీదరి లింగయ్య, వీరమల్ల కృష్ణయ్య, వెంపటి శ్రీనివాస్, మంచుకొండ ప్రభాకర్, మిట్టపల్లి శ్రీనివాస్, చాణక్య, అట్టెం రవి, రామ్మోహన్, వెంకట శ్రీనివాస్, చేపూరి కృష్ణయ్య, వైశ్య వికాస సలహాదారు బుక్కా ఈశ్వరయ్య, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, చిట్టిప్రోలు యాదయ్య , తేలుకుంట్ల రాంబాబు, మారం రవీందర్, హలియా వాసవి క్లబ్ అధ్యక్షుడు గట్టు వెంకటేశ్వర్లు, వీరమల్ల కళావతి, శోభన్ బాబు,
సముద్రాల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.



