పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన 

పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన 

విశ్వంభర, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ 61వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీలో స్థానిక ప్రజలు నిర్మించుకుంటున్న పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలు చేపడుతున్న ఈ ఆలయ నిర్మాణం కాలనీ వాసుల ప్రాంతీయ ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాలనీ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పంజాల అశోక్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. - 
పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 
దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు
ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం 
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నాం