ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
On
విశ్వంభర, ఉప్పుగూడ : ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదానం వితరణ కార్యక్రమాన్ని లక్ష్మనేశ్వర ఆలయంలో శివునికి రుద్రాభిషేకం గోగ్రాసo, అనంతరం అన్నదానం చేశారు. లక్ష్మనేశ్వర దేవాలయం చైర్మన్ దామోదర్ రెడ్డి సంఘ సభ్యులకు అందరికీ సన్మానం చేశారు. ప్రధాన కార్యదర్శి చాలు కె నాగరాజు గుప్తా దంపతులు పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. సంఘానికి సలహాదారులు మాజీ అధ్యక్షులు గుగ్గిల అశోక్ కుమార్ గుప్తా, సరాబు విశ్వేశ్వరయ్య గుప్తా, సంఘం అధ్యక్షులు సరాబు సంతోష్ కుమార్, కోశాధికారి గుగ్గిళ్ళ సంతోష్ కుమార్ గుప్తా, అడిషనల్ వైస్ ప్రెసిడెంట్ బలస రవికుమార్ గుప్తా,అడిషనల్ సెక్రెటరీ పెద్ది నాగేష్ గుప్తా, సభ్యులు యాదగిరి,శివకృష్ణ,శ్రీకర్, దేవాలయ సభ్యులు సంఘ సభ్యులు అందరూ కలిసి ఒక కార్యక్రమం విజయవంతం చేశారు.



