ఈ ఏడాది చేనేత రంగానికి వివిధ పథకాల కింద వెయ్యి కోట్లు అందించాం.
-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రజా విశ్వంభర, నారాయణగూడ ; ఈ ఏడాది చేనేత రంగానికి వివిధ పథకాల కింద 1000 కోట్ల రూపాయల సాయం అందించడం జరిగింది శనివారం వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నారాయణగూడ పద్మశాలి భవన్లో ఏర్పాటుచేసిన హ్యాండ్లూమ్ ఎక్స్పోను రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన ఏడాది నుంచి వీరు చేస్తున్న కృషి ప్రశంసించదగినదని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించడానికి కృషి చేస్తుందన్నారు ప్రతి పౌరుడు చేనేత వస్త్రాలను ధరించి చేనేత వృత్తిని కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు . ప్రాచీనమైన, తరతరాలుగా మన సంస్కృతిలో భాగమైన ఈ వృత్తిని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దేఅన్నారు . కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ , గడ్డం జగన్నాథం మరియు అఖిల భారత పద్మశాలి యువజన విభాగం జాతీయ ఇన్చార్జి అవ్వారి భాస్కర్ లు ఉత్పత్తిదారుల నుండి సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు ఈ ఎక్స్పో ద్వారా అందుబాటులో ఉన్నాయని ఇట్టి అవకాశాన్ని హైదరాబాద్ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా చేనేత వృత్తిని ప్రోత్సహించిన వారు అవుతారని తెలిపారు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక రూప మాట్లాడుతూ నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు నేతన్నలను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చేనేత వస్త్రాలు పర్యావరణాన్ని రక్షించడంలో కీలక భూమిక పోషిస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, ,తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్, ఏబీపీఎస్ యువజన విభాగం సెక్రటరీ బరెంకల ప్రియ, టిపిఎస్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ సప్నా రాజ్ కుమార్ చిన్నకోట్ల , గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ , ఏబిపీఎస్ కోశాధికారి కొక్కుల దేవేందర్, బి టిపి పిఎస్ మహిళా విభాగం కోశాధికారి రేఖా నోముల , సికింద్రాబాద్ పద్మశాలి సమాజం అధ్యక్షులు నోముల రాంప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి యువజన విభాగం అధ్యక్షులు చిన్ని రాకేష్ అరుణశ్రీ ,కైరం కొండస్వరూప, బొమ్మరిల్లు విజయ ,సన్నపురి సరోజ , మౌనికకటకం ,ఆడెపు శాంతి అర్షణ్ పల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు



