ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు వివిధ గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామపంచాయతీలు,పాఠశాలల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి సంబురంగా జరుపుకున్నారు. ఇనుగుర్తి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీడీవో బండారు పార్థసారథి,పోలీస్ స్టేషన్లో ఎస్సై కరుణాకర్, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పిహెచ్ఎస్,ఎంఆర్సి లో ఎంఈ వో రూపారాణి, బాలికల గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపాల్ జయశ్రీ,వివిధ పార్టీ కార్యాలయాలలో ఆయా బాధ్యులు, బిజెపి ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ జాతీయ పతాకం ఎగురవేశారు. జాతీయ,తెలంగాణ గీతాలను ఆలపించారు. మిఠాయిలు పంపిణీ చేశారు.  మేజర్ గ్రామపంచాయతీ ఇనుగుర్తిలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, కోమటిపల్లిలో మద్దెల బిక్షపతి గౌడ్,చీన్య తండాలో హరిచంద్ నాయక్, లతోపాటు ఆయా గ్రామపంచాయతీలలో ఆయా సర్పంచులు పతాకావిష్కరణ చేశారు. ఆయా కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు కార్యాలయ ఉద్యోగులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-independence-day-celebrations/article-16157

Tags: