అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 

అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి -  -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 

విశ్వంభర, హైదరాబాద్ : ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతుంటే మన మేధావులేమైపోయారు ? అని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా అందరు గమనించాల్సిన విషయం ఏమంటే 
ఈ ప్రభుత్వాలను మనమే ఎన్నుకున్నాము. ప్రభుత్వ యంత్రాంగం , న్యాయవ్యవస్థ  పద్దతి ప్రకారం ఎన్నుకున్నవే. ఇక ఇన్ని ఘోరాలు నేరాలు అవినీతి అక్రమాలు జరుగుతుంటే   మత ద్వేషాలు పెరుగుతుంటే మేధావులు విద్యావంతులు , ప్రజాస్వామ్యవాదులు ఏం చేస్తున్నారని ప్రశ్నకు  రాజ్యం అన్ని యంత్రాంగాలు ప్రభుత్వాలు జవాబుదారీ కద! వాల్లను ఎన్నుకున్నదే అందుకు! ఎన్నుకున్నదే మనం. ఎన్నుకునేటప్పుడే ఈ సోయి వుండాలి. ఎవరికో వోటేసి వాల్లు తప్పు చేస్తే ఇంకెవరినో పోరాటం చేయాలి, అని అడగడమేమిటి?  అధికారం ఒకరికిచ్చి మరొకరిని పోరాటం చేయాలంటే కుదరదు అన్నాడు కాన్సీరాం. సిపి ఐ సిపియం వాల్లు చేసిన పోరాటాల వల్ల ప్రయోజనం పొందినవాల్లంతా ఓటేస్తే 130 పార్లమెంటు సీటు రావాలి. ముప్పయి సీట్లే వస్తున్నాయంటే పనిచేసినవారికి ఓటేయలేదని అర్థం అన్నారు కాన్సీరాం. అందువల్ల అవసరం ఉన్నవాల్లే , 
ఇలా అడిగిన వాల్లే పోరాటం చేయాల్సింది . వాల్లు  ఇంటిలో వుంటే ఇతరులు పోరాటం చేయాలని కోరడం సంస్కారం కాదు. మేధావులు ఎప్పటికప్పుడు అన్యాయాలగురించి చెప్తేనే కదా ప్రజలకు తెలిసింది. ఏరీ మేధావులు అని అడిగేవారు ముందు బడితే మేధావులు మద్దతుగా కదిలి వస్తారు. వారు రాకపోతే వీరే మేధావులుగా నాయకులుగా ఎదుగుతారు. అందువల్ల కదలాల్సింది మేధావులను ప్రశ్నించే చైతన్యం పొందినవారే. 
ఎందుకు అలాంటి వాల్లకు ఓటేసారో అని ప్రజలనుకూడా ప్రశ్నించకపోతే ప్రయోజనం ఏమిటి? పత్రికలు టీవీలు జర్నలిస్టులు మేధావులు ఎప్పటికప్పుడు అన్యాయాలు అక్రమాలు అవినీతి వెలికి తెస్తున్నారు . నిలదీస్తున్నారు. కదలాల్సింది మేధావులను ప్రశ్నించే వారే! తాము చేయని పని మంది చేయాలనే స్వార్థ తత్వం  వదులుకుని ముందుకు కదలాలి. . కలిసివచ్చే మేధావులు మద్దతు ఇస్తారు! ప్రజలు ఇటీవల బీసీలకు 42 శాతం రికర్వేషన్లు చట్ట సభల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించాలని రాజ్యాంగ సవరణ చేయాలని కదులుతున్నారు. వారికి మద్దతుగా కదిలితే బీసీ వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతుంది. అవకాశాలు జీవన ప్రమాణాలు పెరుగుతాయి., ప్రజలుఈ విషయాలు గమనించాలని కోరుతున్నాను.

Tags: