పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో మేలు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో మేలు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర దించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉదయం నుంచి ఆయన రాజీనామా డ్రామా నడుస్తోంది. 

ఎందుకంటే జగిత్యాల నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి చాలా అసంతృప్తితో ఉన్నారు. తనను మాట మాత్రం అయినా అడగకుండా తన ప్రత్యర్థిని చేర్చుకోవడం తనను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. 

తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు అలెర్ట్ అయ్యారు. మంగళవారం ఉదయమే వందలాది మంది నేతలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దంటూ వారు నచ్చజెప్పడంతో జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. 

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో మేలు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.