కురుమూర్తి స్వామీ ఉద్దాల ఉత్సవానికి పటిష్ట పోలీసు బందోబస్తు
విశ్వంభర, చిన్న చింతకుంట :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించనున్న ఉ ద్దాల ఉత్సవానికి మహబూబ్నగర్ జిల్లా పోలీసు శాఖ పతిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో 697 మంది పోలీసు అధికారులు సిబ్బందిని బందోబస్తు వి ధులకు నియమించామని జిల్లా ఎస్పీ శ్రీ మతి డి జానకితెలిపారు. ఈ సందర్బంగా కురుమూర్తి ఆలయ ప్రాంగణంలోని అవుట్ పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను అప్రమత్తంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు,అసౌకర్యం కలగకుండా చూడాలని సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. మఫ్టీ పోలీసులతో నిఘా, మహిళల రక్షణకై షీ టీమ్స్ , అనునిత్యం సీసీ కెమెరాల నిఘా తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బందోబస్తు కోసం ఒక ఎస్పీ, అ ద నపు ఎస్పీ ఒకరు, అదనపు డీఎస్పీ ఒకరు, డీఎస్పీలు నలుగురు, సీఐలు 30 మంది, ఎస్సైలు 61 మంది, ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ 113 మంది, పోలీస్ కానిస్టేబుళ్లు 282 మంది, మహిళా పోలీస్ కానిస్టేబుల్ 82 మంది, హోంగార్డులు 123 మంది నియమించారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్లు సిసి కుంట ఎస్సై గోకారి, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



