సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన కౌన్సిలర్ సోలిపురం సుచరిత బల్వంత్ రెడ్డి
విశ్వంభర, చేవెళ్ల:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మున్సిపాలిటీ 6వ వార్డులో కౌన్సిలర్ సోలిపురం సుచరిత బల్వంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తన సొంత నిధులతో గ్రామానికి అంబులెన్స్‌ను అందించారు చేవెళ్ల శాసనసభ్యులు యాదయ్య సహకారంతో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అలాగే అర్హులైన గ్రామస్తులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్మశాన వాటికలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తన సొంత ఖర్చులతో బోర్వెల్ కూడా వేయించారు.వార్డులో ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ సమతా వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్, కౌన్సిలర్ శైలజ ఆగిరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



