అర్హులైన చేనేత కార్మికులంద‌రికీ చేయూత పింఛ‌న్లు ఇవ్వాలి. -  ఏలె శ్రీనివాసులు, డైరెక్ట‌ర్ చేనేత స‌హ‌కార సంఘం. 

మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు విన‌తి

అర్హులైన చేనేత కార్మికులంద‌రికీ చేయూత పింఛ‌న్లు ఇవ్వాలి. -  ఏలె శ్రీనివాసులు, డైరెక్ట‌ర్ చేనేత స‌హ‌కార సంఘం. 

  • పింఛ‌న్లు  మంజూరు చేసేవ‌ర‌కు పోరాడుతాం. 
     -  అధ్య‌క్షుడు రాపోలు ప్ర‌భాక‌ర్‌ చేనేత ప‌రిర‌క్ష‌ణ సేవాస‌మితి(సీపీఎస్‌)

విశ్వంభర, చండూరు;-  మున్సిపాలిటీ ప‌రిధిలో 32 మంది అర్హుల‌ను చేనేత చేయూత పింఛ‌న్‌కు ఎంపిక చేయ‌లేద‌ని వారితో పాటు ఇంకా అర్హులైన వారంద‌రికీ పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని చండూరు చేనేత స‌హ‌కార సంఘం డైరెక్ట‌ర్ ఏలె శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధ‌వారం సీపీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు రాపోలు ప్ర‌భాక‌ర్‌తో పాటు  ప‌లువురు చేనేత కార్మికుల‌తో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ మ‌ల్లేషం ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వం ఉన్న‌త అధికారులు అర్హుల విష‌యంలో దృష్టి సారించి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌య‌మై స్థానికి ఎమ్మేల్యే కోమ‌టి రాజ్‌గోపాల్‌రెడ్డితో పాటు ఉన్నత అధికారుల‌ను క‌లుస్తామ‌ని తెలిపారు.

అర్హులైన వారందరికీ పింఛ‌న్లు వ‌చ్చే వ‌ర‌కు సీపీఎస్ పోరాడుతుంది.  - రాపోలు ప్ర‌భాక‌ర్‌, సీపీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు,చండూరు.

Read More వినయ విధేయ టీం ఆధ్వర్యంలో అన్నదానం

చండూరు మున్సిపాలిటీతో పాటు మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని అర్హులైన  చేనేత కార్మికులంద‌రికీ చేయూత పింఛ‌న్లు మంజూరు చేసే వ‌ర‌కు చేనేత ప‌రిర‌క్ష‌ణ సేవా స‌మితి(సీపీఎస్‌) పోరాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల పింఛ‌న్ల విష‌యంలో అన్యాయం జ‌రిగింది. దీనిపైన అంచ‌లంచెలుగా ఉద్య‌మిస్తాం. రానున్న రోజుల్లో చేనేత వృత్తిని ప‌రిర‌క్షించ‌డానికి పేద కార్మికుల‌ను అన్ని విధాల ఆదుకోవ‌టానికి సీపీఎస్‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్నాం. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డైతే కార్మికులు  ఉంటారో అక్క‌డ సీపీఎస్ క‌మిటీ  ఏర్పాటు అవుతుంది. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కు విన‌తి ప‌త్రం ఇచ్చిన వారిలో చెరుప‌ల్లి రాము, గుండు సంతోష్‌, గంజి పాప‌య్య‌, గ‌డ్డం శేఖ‌ర్‌, రుద్ర స్వామి, గంజి అశోక్‌, జ‌ల్ద ద‌శ‌ర‌థ‌, చెరుప‌ల్లి శ్రీను, వ‌ర్కాల యాద‌గిరి  త‌దిత‌రులు పాల్గొన్నారు

 

Tags: