మన్య కృష్ణవేణికి శ్రద్ధాంజలి తెలిపిన గద్దె విజయ్ నేత
విశ్వంభర, వనస్థలిపురం :-వనస్థలిపురం మార్కండేయ స్వామి దేవాలయం, వనస్థలిపురం హాస్టల్ భవన వ్యవస్థాపకులు, వనస్థలిపురం పద్మశాలి సంఘం అధ్యక్షులు మన్య సత్యనారాయణ సతీమణి మన్య కృష్ణవేణి నవంబర్ 10 వ తేదీన మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి టిడిపి అడ్ హాక్ కమిటీ సభ్యులు, బి.యన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత వారి నివాసానికి మన్య సత్యనారాయణ నీ పరామర్శించి కృష్ణవేణి చిత్రపటానికి నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ, మన్య కృష్ణవేణి నాకు నా తల్లితో సమానం. వారి మరణం తీరని లోటు అని, వారి మరణవార్త నన్ను ఎంతగానో కలచివేసింది. వారిని కోల్పోవడం మా కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లుగా భావిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మన్య సత్యనారాయణ కి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గద్దె విజయ్ నేతతో పాటు టీడీపీ ఎల్.బి. నగర్ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



