139వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

139వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

విశ్వంభర, చేవెళ్ల: ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  నిర్వహిస్తున్న 139వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. వైభవ్ రెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు మున్నూరు శ్రీకాంత్‌తో పాటు చేవెళ్ల మండల మరియు మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి వీక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలతో నేరుగా అనుసంధానమవుతూ, దేశవ్యాప్తంగా ప్రజలు సాధిస్తున్న విజయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతలో స్ఫూర్తిని నింపే అంశాలను ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రధానమంత్రి ఇచ్చే సందేశాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల, మున్సిపాలిటీ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: