ఛత్రినాక లో జోరందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు.
విశ్వంభర/ యాకుత్‌పుర:-టి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం యాకుత్‌పురా నియోజకవర్గంలోని ఛత్రినాక డివిజన్లో ఘనంగా నిర్వహించారు. యాకుత్ పుర ఇన్చార్జ్ ఆశీష్ దుబే , మహిళా అధ్యక్షురాలు కట్టల శారద ముదిరాజ్ , ఉపాధ్యక్షులు నందా ల అనిల్ కుమార్ (నేత ) ప్రధాన కార్యదర్శి సిరిసుల్ల రవికాంత్ అడ్వకేట్ (నేత ) క్లాసిక్ శీను హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థినులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఫారమ్-18 అందజేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మహిళలు,నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా టి ఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదని, విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించి ప్రతినిధిని ఎన్నుకునే గొప్ప అవకాశమని పేర్కొన్నారు.



