గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనే లక్ష్యం. - ఎమ్మెల్యే కాలే యాదయ్య
ఈర్లపల్లి, గొల్లగూడెంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
విశ్వంభర, చేవెళ్ల: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లి, గొల్లగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈర్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య రాజశేఖర్ గౌడ్ , గొల్లగూడెం గ్రామ సర్పంచ్ చెవుల నిర్మల నర్సింలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈర్లపల్లి గ్రామంలో రూ.5 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ ప్రహరీ గోడను, రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన వీధి దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా గొల్లగూడెం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల రూపురేఖలు మారేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈర్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య రాజశేఖర్ గౌడ్, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్, సమతా వెంకటరెడ్డి, ఆగి రెడ్డి, సహకార సంఘం చైర్మన్, ప్రతాప్ రెడ్డి, పొల్యూషన్ బోర్డ్ మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి, వీరేందర్ రెడ్డి, రాములు, రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, ధవన్ గారి గోపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



