పెదవేడు గ్రామంలోకి ఉదయం రాజేంద్రనగర్ బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవాలి

రాజేంద్రనగర్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్

పెదవేడు గ్రామంలోకి ఉదయం రాజేంద్రనగర్ బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవాలి

విశ్వంభర, షాబాద్:మండల పరిధిలోని పెదవేడు గ్రామ విద్యార్థులు, రైతులు, ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామానికి ఉదయం రాజేంద్రనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సును గ్రామంలోకి నడపాలని మాజీ సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.గ్రామం నుంచి పలువురు విద్యార్థులు ప్రతిరోజూ షాబాద్ మోడల్ స్కూల్‌తో పాటు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులను ఆశ్రయిస్తున్నారని, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇతర బస్సులు గ్రామానికి వస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా ఉదయం రాజేంద్రనగర్ నుంచి ఉదయం 8:30 గంటల సమయంలో వచ్చే బస్సు మాత్రం గ్రామం బయట నుంచే వెళ్తోందని పేర్కొన్నారు.ఈ బస్సును గ్రామం బయట నుంచి కాకుండా పెదవేడు గ్రామంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కోరారు. విద్యార్థులతో పాటు గ్రామ రైతులు, ప్రజలు కూడా రవాణా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తు, గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8:30 గంటలకు వచ్చే రాజేంద్రనగర్ బస్సును గ్రామంలోకి నడిపేలా తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Tags: