శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవంలో దేవరకద్ర శాసనసభ్యులు .

శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవంలో దేవరకద్ర శాసనసభ్యులు .

విశ్వంభర/ చిన్నచింతకుంట :- మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం దేవరకద్ర నియోజకవర్గం  చిన్నచింతకుంట మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో దేవర కద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి  (GMR) మరియు కాంగ్రెస్ నాయకులు కొత్త అరవింద్ కుమార్ రెడ్డి, వడ్డేమాన్ గ్రామ సర్పంచ్ స్వప్న శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి  'చాట ' పాదుకలు  దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ కురుమూర్తి స్వామి జాతర ఉత్సవానికి  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, స్వామివారి దయవల్ల వర్షాలు సకాలంలో కురవాలని, ఎలినోవా ప్రభావంతో నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. అలాగే అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు శాఖ ప్రతినిధుల సమన్వయంతో జాతర మహోత్సవం విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు    ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు,అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Tags: