పోతుగల్ బీరప్ప–మహంకాళి ఆలయానికి రూ.3.60 లక్షల విరాళం
సొంత నిధులతో ధ్వజస్తంభం, విగ్రహాల ఏర్పాటు.. ఘనంగా ఆలయ ప్రారంభోత్సవం
విశ్వంభర, షాబాద్: షాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని శ్రీ బీరప్ప స్వామి–మహంకాళి మాత ఆలయ అభివృద్ధికి దాత గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి రూ.3.60 లక్షల విరాళాన్ని అందజేశారు. తన సొంత నిధులతో ఆలయ ధ్వజస్తంభం, బీరప్ప స్వామి, మహంకాళి మాత విగ్రహాల ఏర్పాటుకు సహకారం అందించారు.ఈ సందర్భంగా సోమవారం ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ పోతుగల్ సర్పంచ్ పామేన నర్సింలు , సహకార సంఘం మాజీ చైర్మన్ బండ మహేందర్ ,బండ సతీష్ కుమార్, కావలి రమేష్ ,బీసీ సేన షాబాద్ మండల యువజన విభాగం అధ్యక్షులు బండ అజేయ్ కుమార్ ,బండి దయాకర్ ,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.



