జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
బంగారు, వెండి, కాంస్య పతకాలు కైవసం
On
విశ్వంభర, నల్లగొండ :- తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో నవంబర్ 1న ఇండియన్ హఠ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో నల్గొండ ఓక్లో స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ఎం. హైందవి (8వ తరగతి) బంగారు పతకం, టి.హెచ్. చతుర్వ కుషాల్ (5వ తరగతి) వెండి పతకం, ఎం. వేదాంత్ (6వ తరగతి) కాంస్య పతకం సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల చైర్మన్ తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, డైరెక్టర్లు గడ్డం మంగారెడ్డి, యదుల్ల సునీల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యతో పాటు క్రీడలు, యోగాలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే సమగ్ర విద్యా ప్రణాళికే ఈ విజయాలకు దోహదపడిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.



