సీఎం రేవంత్ రెడ్డినీ కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే
On
విశ్వంభర,హైదరాబాద్:డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.ఈ వినతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, చేవెళ్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకి ఆదేశించారు.నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి, నిధుల మంజూరుపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క లకు ఎమ్మెల్యే కాలే యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు.



