సీఎం ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : - డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది
విశ్వంభర, తాండూరు:ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.తాండూరు నియోజకవర్గంలోని గాంధీనగర్, ఇందిరానగర్, పాత తాండూరు, బషీరాబాద్ మండలంలోని జీవన్గీ, క్యాద్గిరి తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు రూ.4 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇందిరానగర్‌కు చెందిన దయానంద్ కుటుంబానికి రూ.60 వేలు, గాంధీనగర్‌కు చెందిన కృష్ణమూర్తి కుటుంబానికి రూ.50 వేలు, పాత తాండూరుకు చెందిన మైముదాబేగంకు రూ.20 వేలు, సయ్యద్ షకీల్‌కు రూ.60 వేలు, జీవన్గీకి చెందిన సుదర్శన్ రెడ్డికి రూ.83 వేలు, శైలజకు రూ.49,500, రమణారెడ్డి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్ రెడ్డి, సాయిరెడ్డి, రాజు, మైమూద్, జిలానీ తదితరులు పాల్గొన్నారు.



