వంటశాలను ప్రారంభించిన సర్పంచ్ రమేష్.

వంటశాలను ప్రారంభించిన సర్పంచ్ రమేష్.

విశ్వంభర,మహబూబాబాద్ మండలం :-మాధవపురం గ్రామంలో నీ  ఉన్నత పాఠశాలలో  నీ  ఉన్న  వంటగదిని మాధవపురం గ్రామ సర్పంచ్ వెంపటి రమేష్  , ఉప సర్పంచ్ మద్ది వెంకటరెడ్డిలు కలిసి రిబ్బన్ కటింగ్ చేసి  ప్రారంభించారు . ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్లు మాట్లాడుతూ  గ్రామంలోని ఉన్నత పాఠశాలలో  అసంపూర్తిగా   ఉన్న వంటగదిని  ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా  పనిచేస్తున్న  వలబోజు స్నేహలత   తన సొంత డబ్బులతో నిర్మాణం చేసినందుకు  హెచ్ఎం  కి మాధవపురం గ్రామం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని  వారు అన్నారు . అంతేకాకుండా ఇంత మంచి మనసున్న స్కూల్ హెచ్ఎం వలబోజు స్నేహలతకి  గ్రామస్తులు ఎప్పటికీ రుణపడి ఉంటారని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని గుర్తు చేశారు . అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  వంటగదిలోని గ్యాస్ స్టవ్ ను ప్రారంభించి,  విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు అతిధులు అందరికీ పాయసం  తయారు చేయించారు . ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు విద్యార్థిని ,  విద్యార్థులు , పాల్గొన్నారు .

Tags: