కల్వ సుజాతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి.  -ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా నాయకుల డిమాండ్

కల్వ సుజాతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి.   -ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా నాయకుల డిమాండ్

విశ్వంభర, షాబాద్: ఆర్యవైశ్య సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన గుర్తింపు, సముచిత ప్రాధాన్యత కల్పించాలని ఆర్యవైశ్య మహాసభ నాయకులు పూర్ణచందర్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ, సామాజిక, సేవా రంగాల్లో ఆర్యవైశ్యులు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతికి, మహిళా సాధికారతకు, సామాజిక సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేస్తున్న కల్వ సుజాతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అవకాశం కల్పించాలని కోరారు. ఆర్యవైశ్యుల తరఫున సమర్థవంతంగా గళం వినిపించే నాయకులకు రాజకీయంగా ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యులు వ్యాపార రంగంతో పాటు విద్యా, వైద్య, సామాజిక, సేవా రంగాల్లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారని, అలాంటి సామాజిక వర్గానికి రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Tags: