తగ్గేదే లేదు మేమే టాప్.... తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు. -

తెలంగాణ ప్రజా పాలనలో...... మద్యం విక్రయాలు.....

తగ్గేదే లేదు మేమే టాప్.... తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు. -

  • 19 రోజుల్లోనే రూ.2,054 కోట్ల విక్రయాలు..
  • గత ఏడాదితో పోలిస్తే 37 శాతం ఎక్కువగా తాగేశారు..

 

విశ్వంభర, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌ 1 నుంచి 19వ తేదీ వరకు కేవలం 19 రోజుల్లోనే రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రచురితమైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మద్యం విక్రయాల్లో 37.02 శాతం వృద్ధి నమోదైనట్లు ఆ నివేదిక పేర్కొంది. పండుగలు, వరుస సెలవుల నేపథ్యంలో మద్యం కొనుగోళ్లు పెరిగినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.

రోజుకు సగటున రూ.108 కోట్లకు పైగా!

Read More సర్వే నంబర్ 691/2 రిజిస్ట్రేషన్‌పై స్పష్టత.. సీసీఎల్‌ఏ ఉత్తర్వుల మేరకే చేశాం

19 రోజుల విక్రయాలను పరిశీలిస్తే రోజుకు సగటున సుమారు రూ.108.13 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అంచనా. అక్టోబర్‌ 19వ తేదీన ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో స్పష్టం చేస్తున్నాయి.

బీర్ల అమ్మకాల్లోనూ భారీ పెరుగుదల

మద్యం విక్రయాలతో పాటు బీర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి 19వ తేదీ వరకు 30.37 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే బీరు అమ్మకాల్లో 40.93 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. మరోవైపు, ఇంపోర్టెడ్‌ మద్యం విక్రయాల్లోనూ 29.80 శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

పండుగల ప్రభావమా.. పెరుగుతున్న వినియోగమా?

దసరా, వరుస సెలవుల సమయంలో మద్యం కొనుగోళ్లు పెరగడం సాధారణమే అయినప్పటికీ, కేవలం 19 రోజుల్లోనే వేల కోట్ల రూపాయల విక్రయాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. పండుగల ప్రభావంతో పాటు వినియోగదారుల కొనుగోలు ధోరణులు, మద్యం అందుబాటు, విక్రయాలపై ప్రభుత్వ విధానాలు వంటి అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఆదాయం పెరుగుదలతో పాటు సామాజిక ప్రభావంపైనా దృష్టి అవసరం

మద్యం విక్రయాలు పెరగడం ప్రభుత్వానికి పన్నులు, ఎక్సైజ్‌ ఆదాయం రూపంలో ప్రయోజనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, మరోవైపు కుటుంబాల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, రోడ్డు ప్రమాదాలు, మద్యానికి సంబంధించిన సామాజిక సమస్యలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మద్యం వినియోగం వల్ల కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం, యువతపై దాని ప్రభావం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు చేరుతుండగా, అధిక వినియోగం వల్ల ఏర్పడే సామాజిక పరిణామాలను నియంత్రించడం మరోవైపు ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆదాయ గణాంకాలతో పాటు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజల అభిప్రాయం 

గత ఏడాదితో పోలిస్తే రూ.555.05 కోట్ల అధిక విక్రయాలు.
బీర్ల కేసుల విక్రయాల్లో 40.93 శాతం వృద్ధి.
ఒక్కరోజులో రూ.303.40 కోట్ల విక్రయాలు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ రూ.3,000 కోట్లకు పైగా నెలవారీ విక్రయాలు.
ప్రభుత్వానికి వచ్చే ఎక్సైజ్ ఆదాయం, కుటుంబాలపై మద్యం ఖర్చు ప్రభావం, ప్రజారోగ్యం వంటి అంశాలపై పరిశీలన అవసరం.

దసరా ముందు నాలుగు రోజుల్లో విక్రయాలు
తేదీ మద్యం విక్రయాలు
అక్టోబర్ 14 ₹102.17 కోట్లు
అక్టోబర్ 16 ₹126.32 కోట్లు
అక్టోబర్ 17 ₹223.25 కోట్లు
అక్టోబర్ 19 ₹303.40 కోట్లు
మొత్తం ₹755.14 కోట్లు

ఇక బీర్ల విషయానికొస్తే 

బీర్ల విక్రయాలు – గత ఏడాదితో పోలిక
వివరాలు 2025 అక్టోబర్ 1–19 2026 అక్టోబర్ 1–19 పెరుగుదల
బీరు కేసులు 21.55 లక్షల నుండి 30.37 లక్షలు  కాగా 8.82 లక్షలు
బీర్ల విక్రయాల పెరుగుదల నమోదు అయ్యింది

  (వెంకట్ పులిపాటి)
  ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 
      9959232603
 

 

Tags: