శ్రీ అభయఆంజనేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన గ్రామస్తులు .
On
విశ్వంభర, జూలూరుపాడు: మండల కేంద్రంలోని అనంతారం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి గ్రామస్తులు భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు పురాణం కామశాస్త్రి ఆధ్వర్యంలో ఆలయానికి శంకుస్థాపన చేశారు. వేద పండితులు మాట్లాడుతూ గ్రామాలలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అంటే గ్రామంలోని దేవాలయాలు ఉండాలని అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బందు సమన్వయ సమితి అధ్యక్షులు యదలపల్లి వీరభద్రం దంపతులు, కురస రమేష్ దంపతులు, మలకం వీరభద్రం దంపతులు, రావిళ్ళ నరేష్ దంపతులు, మరియు గ్రామ ప్రజలు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.



