పద్మశాలి మహాసభ కరపత్రం ఆవిష్కరణ
On
- ఆవిష్కరించిన గ్రేటర్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత
విశ్వంభర, సికింద్రాబాద్ : మార్చి 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగబోయే అఖిలభారత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాల మహాసభల కరపత్రాన్ని గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత చేతుల మీదుగా విడుదల చేశారు. 142 డివిజన్ అడ్డగుట్ట భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కండ్లపల్లి సత్య భూషణం ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సమీక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాజు నేత మాట్లాడుతూ సభ్యులను ఉద్దేశిస్తూ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని పద్మశాలి కుల బాంధవులందరూ తమ కుటుంబ సమేతంగా సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.