విజయవాడ కనకదుర్గమ్మకు బయలుదేరిన రెండవ బంగారు బోనం
On
విశ్వంభర, హరి బౌలి : ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సప్తమాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో శనివారం రెండవ బంగారు బోనం శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం నుండి బయలుదేరి ఆదివారం 10 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బంగారు బోనం సమర్పణ జరుగుతుందని ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా వందకు పైగా మహిళలు 250 కి పైగా ఆలయాల సభ్యులు కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం సహాయ సహకారాలందిస్తున్న పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలిపారు.



