బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో అమావాస్య అన్నదానం.
విశ్వంభర, ఎల్బీనగర్ : సరూర్ నగర్ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా సరూర్ నగర్ గోల్డెన్ వాకర్స్ టీం ( ఆర్యవైశ్య గ్రూప్) వారి సహకారంతో 500 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసినట్లు బంగారు మైసమ్మ దేవాలయం ఫౌండర్ ట్రస్టీలు ఆకుల అరవింద్ కుమార్, బేర బాలకిషన్( బాలన్న ) లు తెలిపారు. వారు మాట్లాడుతూ సరూర్నగర్ చరిత్రలోనే బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రతిరోజు 200 మందికి పైగా భక్తులకు దాతల సహాయంతో అన్నదానం నిర్వహిస్తున్నామని అని, ప్రతి అమావాస్య రోజు సరూర్నగర్ గోల్డెన్ వాకర్స్ టీం గౌరవ అధ్యక్షులు ఎన్టీఆర్ కృష్ణ, కాసెట్టి నగేష్ గుప్తా, కూర శ్రీనివాస్ గుప్తా, చోలేటి ఆనంద్ గుప్తా, నాంపల్లి శ్రీనివాస్ గుప్తా, సాంబమూర్తి గుప్తా ,ఉప్పల వెంకటేశం గుప్తా, వెంకటేశం గుప్తా ల సహకారంతో అమావాస్య రోజు 500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని అని తెలిపారు. ఐదు సంవత్సరాలుగా దేవాలయం వద్ద నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామని, దేవాలయంలో గోశాలతో పాటు సుబ్రహ్మణ్యస్వామి శివాలయం, ధన్వంతరి నారాయణ, ఆంజనేయస్వామి, గణపతి , అన్నపూర్ణ మాతలకు నిత్యం పూజలు నిర్వహిస్తామని తెలిపారు .ప్రతి మంగళవారం వేలాది మందితో సుబ్రమణ్య స్వామికి అభిషేకములు, ప్రతి సోమవారం శివాలయంలో స్పటిక లింగం తోపాటు అగస్తేశ్వరుడు, వైద్యనాథుడు లకు అభిషేకము నిర్వహిస్తున్నామని తెలిపారు .



