కొడుకును బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి
On
విశ్వంభర, చిలుకూరు;- చిలుకూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. దివ్యాంగుడైన కొడుకును బావిలో తోసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన బుడిగం వీరమ్మ భర్త బిక్షమయ్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త మరణించడంతో తన అన్న దొంగరి నాగేశ్వరరావు ఆమె కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఇటీవల అన్న నాగేశ్వరరావు కూడా మృతి చెందడంతోo వీరమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. అన్న మరణంతో తనకు దిక్కు ఎవరూ లేరని భావించి సోమవారం రాత్రి దివ్యాంగుడైన కొడుకు బావిలో తోసి తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సురభి రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



