ఓటేసేందుకు గుర్రంపై వచ్చిన లీడర్

ఓటేసేందుకు గుర్రంపై వచ్చిన లీడర్

విశ్వంభర, హుజూర్ నగర్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర పరిణామం జరిగింది. సహజంగా ఓటు వేసేందుకు నడిచి, లేదా బైకులు, కార్లపై వెళ్తారు. కానీ ఓ వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరిస్తూ.. వినూత్నంగా గుర్రంపై వెళ్లాడు. నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని చింతలపాలెం మండలం రెబల్లె గ్రామ మాజీ సర్పంచ్ నరసింహమూర్తి గుర్రం పై వెళ్లి ఓటు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. గుర్రంపై ఓటు వేసేందుకు వెళుతున్న మాజీ సర్పంచ్ ను స్థానికులు, ఎన్నికల అధికారుల ఆసక్తిగా చూశారు. ఓటేసిన అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ గుర్రపు స్వారీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. వైవిధ్యంగా ఉంటుందనే ఓటేసేందుకు గుర్రంపై వచ్చానని చెప్పారు.