గన్ పార్క్ వద్ద ది గ్రేట్ మిలియన్ మార్చ్ డే

గన్ పార్క్ వద్ద ది గ్రేట్ మిలియన్ మార్చ్ డే

విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద  ది గ్రేట్ మిలియన్ మార్చ్  డే మార్చి 10వ తారీఖున నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి డే అంటూ తెలంగాణ ఉద్యమకారులంతా అక్కడకు చేరుకొని గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. 
        వివిధ పార్టీల నాయకులు అమరులకు శ్రద్ధాంజలి ఘటించి 2011 మార్చి 10వ తారీఖున ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పల్లె నుండి పట్నం వరకు పెద్ద ఎత్తున తెలంగాణ అభిమానులు ఉద్యమకారులు హైదరాబాదుకు తరలి వచ్చి ట్యాంకుబండు పై మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దినమును పురస్కరించుకొని అప్పటి ఉద్యమ తీరును ఉద్యమంలో మరణించిన వారిని స్మరించుకుంటూ కార్యక్రమం కొనసాగించారు.

Tags: