ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే రెండు వేరు వేరు బిల్లులు పెట్టిన ప్రభుత్వం
తెలంగాణ జాగృతి కృషితోనే బీసీ బిల్లు ఆమోదం
విశ్వంభర, తెలంగాణ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితం గానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకులు కే. సాయి కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలగ్గిందని అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం విద్యా ఉపాధి రాజకీయ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేరువేరు బిల్లులను ప్రవేశపెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని ముందే గుర్తించి వేరువేరు బిల్లులు పెట్టాల్సిందేనని డిమాండ్ చేసినది కేవలం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రమే అని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం రెండు వేరువేరు బిల్లులు పెట్టడం ఎమ్మెల్సీ కవిత సాధించిన విజయమని అన్నారు. తెలంగాణ జాగృతి చేసిన సుదీర్ఘ పోరాటంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు అయ్యేవరకు రాష్ట్ర ప్రభుత్వం భారత వహించాలని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలాయే వరకు బీసీ సోదరుల పక్షాన జాగృతి ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ జాగృతి నాయకుడు కే కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు



