అధికారికంగా రాష్ట్రం కోరకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేయడం అవివేకం ప్రకటనలతో కాదు –

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధ రక్షణ కావాలంటే రాజ్యాంగ ప్రక్రియ తప్పనిసరి - డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్

అధికారికంగా రాష్ట్రం కోరకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేయడం అవివేకం ప్రకటనలతో కాదు –

విశ్వంభర, హైదరాబాద్ ;-  తెలంగాణ శాసనసభ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లపై రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ ఈ బిల్లులు Article 31-B (9వ షెడ్యూల్‌లో చేర్చమని కోరకుండానే), కేవలం Article 31-C కింద రాష్ట్రపతికి పంపబడ్డాయి. ఇది నిపుణుల అభిప్రాయం ప్రకారం చట్టపరంగా పెద్ద లోపం. 9వ షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కోరకుండానే, ముఖ్యమంత్రి సహా కొంతమంది మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని డా. వకుళాభరణం హాస్యాస్పదంగా అభివర్ణించారు. ఇది అవివేకం తప్ప మరేదీ కాదన్నారు. ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటుందా? అన్నది అనుమానంగా ఉందని డా. వకుళాభరణం అభిప్రాయపడ్డారు. ఇలాంటి కీలకమైన రాజ్యాంగ అంశంపై ప్రభుత్వం స్పష్టత లేకుండా ఉండటం బీసీల హక్కులకు నష్టం చేసే పరిస్థితి కలుగుతుంది. “ఒక ప్రభుత్వంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో, ప్రకటనలతో ప్రజలను మాయ చేయడం రాజ్యాంగానికి విరుద్ధం,” అని డా. వకుళాభరణం విమర్శించారు. Article 31-C కింద రక్షణ కోరడం తప్పు కాదు; అది ప్రభుత్వానికి రాజ్యాంగపరంగా అందుబాటులో ఉన్న మార్గం. అయితే 9వ షెడ్యూల్‌లో చేర్చే విషయంపై కనీస ప్రయత్నం కూడా ప్రారంభించకపోవడమే అసలైన లోపమని ఆయన వ్యాఖ్యానించారు. 9వ షెడ్యూల్‌లో చేర్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరైన మార్గాన్ని అనుసరించాలని డా. వకుళాభరణం డిమాండ్ చేశారు. మంత్రిమండలిలో తీర్మానం చేయాలి. శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని లేఖ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. Busani Venkateshwar Rao Dedicated Commission నివేదికలు, SEEEPC సర్వే గణాంకాలు, న్యాయతర్కాలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పార్లమెంటు చర్చించి, 9వ షెడ్యూల్‌లో చేర్పు మార్గం సుగమం అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా కృషి చేసినపుడే సాధ్యమవుతుంది. తమిళనాడు 1994లో ఇదే ప్రక్రియతో 69% రిజర్వేషన్లకు రక్షణ పొందిందన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ కూడా అదే బాటలో నడవాల్సిన అవసరం ఉందని డా. వకుళాభరణం సూచించారు. ఇటీవల కొంతమంది మంత్రుల మీడియా ప్రకటనలు సరైన ప్రాముఖ్యత లేని రాజకీయ వ్యాఖ్యలేనని అన్నారు. మీడియా ప్రకటనలతో కాదు – ప్రభుత్వానికి ఉన్న అధికారిక మార్గమే ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించాలని డా. వకుళాభరణం కోరారు. రాష్ట్రపతిని కలవడానికి ప్రభుత్వం తక్షణమే అపాయింట్మెంట్ తీసుకుని, అఖిలపక్ష బృందంతో కలిసి వెళ్లాలని, బిల్లుల అవసరం, గణాంకాలు, విశ్లేషణలతో కూడిన వివరాలు సమర్పించాలని సూచించారు. రాష్ట్రపతిని ఎవరూ ప్రభావితం చేయలేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించాలి అన్నారు. “బీసీలకు న్యాయం కావాలంటే ప్రకటనలతో కాదు — చట్టాన్ని గౌరవించి ముందడుగు వేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఇది సామాజిక న్యాయం జరగని, ఫలితం లేని ప్రక్రియగా చరిత్రలో మిగిలిపోతుంది” అని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.
Busani Venkateshwar Rao Dedicated Commission నివేదికలను సమర్పించిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికీ ఆ నివేదికలు Public Domain లో లేవు. అసలు ఆ కమిషన్ ఏ సిఫార్సులు చేసిందన్న విషయమై ప్రజలకు స్పష్టత లేదు. మరింత గమనార్హమైనది ఏమంటే — మార్చి 17న బీసీ బిల్లులు శాసన సభలోను, శాసన మండలిలోను ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ నివేదికలను సభల ముందు table చేయలేదు. ఈ దశలో కేంద్రాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఏ ఆధారాలతో కోరతారన్నదానిపై నైతిక, విధానపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి పారదర్శక పాలనకు వ్యతిరేకమని, నివేదికలను వెంటనే బహిరంగంగా ఉంచాలని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్పష్టంగా సూచించారు.

Read More మంత్రి అడ్లూరి ని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ నాయకులు.

డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్
📱 98499 12948
📧 vkmrao48@gmail.com

Tags: